Viral Video: వరదలో కొట్టుకుపోయిన కూలీలు - సాంగ్లీలో వరదలు
మహారాష్ట్ర సాంగ్లీలో కురిసిన భారీ వర్షాలతో కాలువలు ఉప్పొంగాయి. పచ్చాపుర్ గ్రామంలో కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మహిళలు వరద నీటిలో కొట్టుకుపోయారు. రెండు గంటల సహాయక చర్యల తర్వాత వారిని గ్రామస్థులు రక్షించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు.