చెరకు తోటలో చిరుత పిల్లలు.. రైతులు హడల్ - చెరకు తోటలో పులిపిల్లలు
మహారాష్ట్ర పుణె హింజ్వడి ప్రాంతంలో రైతులు చెరకు నరుకుతుండగా మూడు చిరుత పిల్లలు కనిపించాయి. దీంతో హడలిపోయిన రైతులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ పిల్లలు తల్లిలేకుండా బతకలేవని.. తిరిగి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వాటి వయసు 15 నుంచి నెల రోజులు ఉంటుందని చెప్పారు.