Live Video: చిన్నారులకు కరెంట్ షాక్.. ఆ తర్వాత... - Bihar latest news
విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో బిహార్ ముజఫర్పుర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని కంటీ పోలీస్ స్టేషన్ పరిధి కోఠియా గ్రామంలో హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఎన్టీపీసీ జలాశయం సమీపంలో 32కేవీ ట్రాన్స్మిషన్ లైన్ చేతులకు తగిలేంత ఎత్తులోనే ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. తీగలకు సమీపంలోకి వెళ్లగా చిన్నారులకు విద్యుత్తు ప్రసారం అయింది. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Last Updated : Jun 6, 2021, 8:01 PM IST