పంచ్గంగా ఉద్ధృతి- లోతట్టు ప్రాంతాలు జలమయం - మహారాష్ట్రలో వర్షాలు
భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. కొల్హాపుర్ ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో గురువారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వరద నీరు చేరటం వల్ల పంచ్గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.