ఉత్తరాదిలో అట్టహాసంగా 'లోహ్రీ' వేడుకలు - ఉత్తరాదిలో అట్టహాసంగా లోహ్రీ వేడుకలు
ఉత్తరాదిలో లోహ్రీ వేడుకలు ఘనంగా జరిగాయి. పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో ప్రజలు చలి మంటలు వేసి సందడి చేశారు. అమృత్‌సర్‌తోపాటు పలు నగరాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో చలి మంటల వద్ద చేరి.. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేశారు. రబీ పంటలు ఇంటికి చేరిన సందర్భంగా.. ఉత్తరాదిన లోహ్రీ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లోహ్రీ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.