ఆ సీఎం కొరడా దెబ్బలు తిన్నారు.. ఎందుకు? - The Chief Minister who flogging out
ఛత్తీస్‌గఢ్ దుర్గ్ జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఓ ఆలయంలో కొరడా దెబ్బలు తిన్నారు. అమ్మవారి ఎదుట కొరడా దెబ్బలు కొట్టించుకుంటే మంచిదని స్థానికుల నమ్మకం. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆ గుడిలోని పూజారి చేతిలో కొరడా దెబ్బలు తిన్నారు. ఆరు కొరడా దెబ్బలు పడిన తర్వాత ముఖ్యమంత్రి చేతిని వెనక్కు తీసుకున్నారు. తర్వాత ఆ పూజారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని వెళ్లిపోయారు.