తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని అభ్యర్థుల ఆందోళన.. - కాక్రీ డూంగ్రీ

By

Published : Sep 24, 2020, 9:39 PM IST

రాజస్థాన్​లోని డూంగర్​పుర్​లో కొంతమంది విధ్వంసం సృష్టించారు. 2018లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష తర్వాత సాధారణ కేటగిరీ కింద ఖాళీగా ఉన్న పోస్టులను.. ఎస్టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని డిమాండ్​ చేస్తూ స్థానికులు ఆందోళనలకు దిగారు. 18 రోజులుగా భువాలీ సమీపంలోని కాక్రీ డూంగ్రీ 8వ నెంబరు జాతీయ రహదారి వద్ద ధర్నా చేపట్టారు. ట్రాఫిక్​ను అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులపైకి రాళ్లు రువ్వగా.. ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు పోలీసులు. ఈ ఘటనలో పోలీసులు సహా పలువురు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details