తెలంగాణ

telangana

ETV Bharat / videos

'నలుగురిని చంపిన పులి కనపడింది.. పనులకు వెళ్లకండి' - తమిళనాడు టైగర్ న్యూస్ టుడే

By

Published : Oct 13, 2021, 11:46 AM IST

గత కొన్నాళ్లుగా తమిళనాడు అటవీశాఖ గాలిస్తున్న 'టి-23' పులి కెమెరాకు చిక్కింది. నీలగిరి అడవుల్లోని బోస్పరా ప్రాంతంలో పులి ఉందన్న సమాచారంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు మొదలుపెట్టారు అధికారులు. ఓ చోట పొదల్లో కనిపించిన పులిని మత్తు తుపాకీతో కాల్చినప్పటికీ గురితప్పినట్లు పేర్కొన్నారు. టి-23 పులి నీలగిరి జిల్లాలో నలుగురిని చంపేసింది. అయితే ఆ పులి కెమెరాకు చిక్కిందని.. దాన్ని పట్టుకునే వరకు ప్రజలెవరూ అడవిలోకి పనులకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details