కదులుతున్న రైలు నుంచి పడిపోయిన వ్యక్తి - తమిళనాడు రైల్వేస్టేషన్ వైరల్ వీడియోలు
కదులుతున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడిన ఓ వ్యక్తిని మహిళా పోలీసులు రక్షించారు. తమిళనాడు సేలం రైల్వేస్టేషన్లో రైలు ఆగుతున్న క్రమంలో బిహార్‌కు చెందిన ఓ యువకుడు ప్లాట్‌ఫాంపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మంజు, అశ్విని అనే ఇద్దరు మహిళా పోలీసులు అతడిని రక్షించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉన్న మహిళా పోలీసులను ఉన్నతాధికారులు ప్రశంసించారు. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.