Viral Video: గ్రామంలోకి చిరుతలు.. వణికిపోతున్న ప్రజలు - పులుల వైరల్ వీడియోలు
తమిళనాడు కోయంబత్తూరులో అర్ధరాత్రి జనావాసాల్లోకి వచ్చి సంచరిస్తున్నాయి పులులు. వాల్పరై గ్రామంలోకి వచ్చిన ఈ క్రూర జంతువులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే.. పులుల సంచారం పెరిగినందున గ్రామస్థులెవరూ రాత్రిపూట బయటకు రావొద్దని అటవీ శాఖ సూచించింది. అన్నామలై టైగర్ రిజర్వును ఆనుకుని ఉన్న వాల్పరైలో పెద్ద సంఖ్యలో చిరుతలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి బర్రెలు, ఏనుగులు ఉన్నాయి. దీనితో స్థానికులు భయం భయంగా నివసిస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలోని దృశ్యాలు సీసీటీవీలో కెమెరాలో రికార్డయ్యాయి.