గడ్డిపై గడ్డకట్టుకుపోయిన మంచు- పర్యటకులకు కనువిందు - గడ్డిపై మంచు బిందువులు
తమిళనాడు, కేరళలోని పర్యటక ప్రదేశాల్లో కురుస్తున్న మంచు.. సందర్శకులకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. తమిళనాడులోని కొడైకెనాల్, కేరళలోని మన్నార్, ఇడుక్కి ప్రాంతాల్లో కురుస్తున్న మంచు వల్ల ఉష్ణోగ్రతలు కనిష్ఠస్థాయికి పడిపోయాయి. మొక్కలు, గడ్డిపైన మంచు బిందువులు గడ్డకట్టుకున్నట్లు పరుచుకుని పర్యటకులకు ఆహ్లాదం పంచుతున్నాయి. వారం రోజులుగా వాతావరణం ఇలాగే ఉండగా.. అక్కడి ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు పర్యటకుల సంఖ్య అమాంతం పెరిగింది.