కరోనాపై అవగాహన కోసం.. ఆ రైల్వేస్టేషన్లో ఇలా? - Corona Awareness
ప్రపంచంపై కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వ్యాధి తీవ్రతపై ప్రజల్లో చైత్యన్యం కల్పించేందుకు ప్రభుత్వం, కళాకారులు, పోలీసులతో సహా స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా తమిళనాడు- చెన్నైలోని తంబారం రైల్వేస్టేషన్ భవనంపై కొవిడ్ చిత్రాలను గీసి అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించే చర్యల్లో భాగంగా వైద్య సిబ్బంది, పోలీసులు చేస్తోన్న కృషిని తెలియజేసే చిత్రాలను గోడలపై వేయిస్తున్నారు. ప్రజలు కూడా మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఇలా బొమ్మల రూపంలో వేసి చూపించారు.