'పౌర'సెగ: పోలీసులకు గులాబీలు ఇచ్చి నిరసన వ్యక్తం - Students of Jamia Millia Islamia university offer roses to police personnel
దిల్లీ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు. వర్సిటీ ఎదుట పహారా కాస్తున్న రక్షకభటులకు గులాబీలు ఇచ్చారు. వారి నుంచి పోలీసులు గులాబీలు స్వీకరించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీ జామియా వర్సిటీ కేంద్రంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే వర్సిటీ ఎదుట భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.