పప్పూయాదవ్ ప్రచారంలో కుప్పకూలిన సభావేదిక - పప్పూయాదవ్ ప్రచారవేదిక
బిహార్ ఎన్నికల్లో భాగంగా జన్ అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ చేపట్టిన ప్రచారంలో అపశ్రుతి జరిగింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో సభావేదిక ఉన్నట్టుండి కుప్పకూలింది. ఘటనలో పప్పూయాదవ్ సహా మరికొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ముజఫర్పుర్లోని మైనాపుర్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఈ ప్రమాదం జరిగింది. వేదిక మీదకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడమే ఘటనకు కారణంగా తెలుస్తోంది.