తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోగిని బెడ్​షీట్​తో లాక్కెళ్లిన ఆసుపత్రి సిబ్బంది - patient

By

Published : Jun 30, 2019, 8:02 AM IST

Updated : Jun 30, 2019, 9:14 AM IST

చికిత్స కోసం వచ్చిన ఓ రోగిని ఎక్స్​ రే రూమ్​లోకి స్ట్రెచర్​పై కాకుండా నేలపై బెడ్​ షీట్​తో లాక్కెళ్లారు ఆసుపత్రి సిబ్బంది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​ జబల్​పుర్​లోని నేతాజీ సుభాష్​ చంద్ర బోస్​ వైద్య కళాళాలలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించి ముగ్గురుని సస్పెండ్​ చేసినట్లు కళాశాల డీన్​ డాక్టర్​ నవనీత్​ సక్సేనా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Last Updated : Jun 30, 2019, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details