కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం - మందుబాబులు
లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులతో.. కరోనా భయాల్ని ఏ మాత్రం లెక్కచేయట్లేదు ప్రజలు. మద్యం షాపుల ముందు బారులు తీరుతున్నారు. ఛత్తీస్గఢ్ రాజనందగావ్లోని ఓ లిక్కర్ షాపు వద్ద కిలోమీటర్ల మేర క్యూలో నిల్చొన్న మందుబాబులు.. భౌతిక దూరం నిబంధనకు తూట్లు పొడిచారు. దగ్గర దగ్గర నిల్చోవడమే కాకుండా మందు కోసం ఎగబడ్డారు. మరికొందరు వాగ్వాదానికి దిగారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
Last Updated : May 4, 2020, 5:21 PM IST