భౌతిక దూరం పాటిస్తూ పంద్రాగస్టు వేడుకలు - independence day in delhi
స్వాతంత్ర్య వేడుకల నిర్వహణలో కరోనా కట్టడి నిబంధనలను పక్కాగా పాటించారు. ప్రధాని కంటే ముందే ఎర్రకోటకు చేరుకున్న అతిథులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. వారంతా భౌతిక దూరం పాటించేలా కుర్చీలను ఏర్పాటుచేశారు. అతిథులంతా మాస్కులను ధరించే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది 30 వేల మందికిపైగా పంద్రాగస్టు ఉత్సవాలకు హాజరు కాగా.. ఈసారి పరిమిత సంఖ్యలో 4 వేల మందే పాల్గొన్నారు.