Snowfall In Kinnaur: హిమాచల్‌లో భారీ హిమపాతం.. రాకపోకలకు అంతరాయం - హిమాచల్‌ను కప్పేసిన మంచు
Snowfall In Kinnaur: హిమాచల్ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. రాష్ట్రంలోని గిరిజన జిల్లా కిన్నౌర్‌లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా వాహనాల రాకపోకలు రద్దు చేశారు అధికారులు. జిల్లాలోని చిత్కుల్, రఖమ్ ప్రాంతాలు పూర్తిగా హిమంతో నిండిపోయాయి. నెసాంగ్, హాంగ్‌రాంగ్ వ్యాలీ ప్రాంతాలు 10 అంగుళాల మేర మంచుతో నిండిపోయినట్లు అధికారులు తెలిపారు. మంచుతో నిండిన ప్రాంతాలను చూసి పర్యటకులు మురిసిపోతున్నారు. హిమపాతం దృష్ట్యా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కిన్నౌర్ కలెక్టర్ అబిద్ హుస్సెన్ సాదిఖీ ఆదేశాలు జారీ చేశారు.