డార్జిలింగ్ను కప్పేసిన మంచు దుప్పటి.. శ్వేత వర్ణంలో చమోలీ - సిక్కింలో మంచు
Snow Fall In Darjeeling: దేశంలో పలు రాష్ట్రాలను మంచు దుప్పటి కప్పేసింది. బంగాల్ డార్జిలింగ్ శ్వేత వర్ణంలోకి మారిపోయింది. బంగాల్లో అత్యంత ఎత్తులో ఉన్న సందకఫు వద్ద ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు నమోదైంది. సిక్కింలో కూడా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా తెల్లని బెడ్ షీట్లా మారిపోయింది. బద్రీనాథ్ ధామ్, ఔలి, రామ్ని, లోహజంగ్‌లో మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను చూడటానికి పర్యటకులు వచ్చారు. మంచులో ఆటలాడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడిపారు.