అంబులెన్స్ బదులు వంట పాత్రలో ఆసుపత్రికి! - snake bite
అకాల వర్షాలకు ఒడిశాలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. వరదలకు అనేక గ్రామాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జయపుర్ జిల్లాలోని రౌత్సహిలో.. పాము కాటుకు గురైన ఓ మహిళను వంట చేసేందుకు ఉపయోగించే పెద్ద డేసాలో ఆసుపత్రికి తరలించారు గ్రామస్థులు. వరద నీటిలోనే దాదాపు 3కి.మీల దూరం ఆ డేసా పట్టుకుని నడిచారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Sep 2, 2020, 7:49 AM IST