లైవ్ వీడియో: కోబ్రాతో 'నువ్వా-నేనా' అనేలా ఫైట్ - king cobra shimoga
కర్ణాటక శివమొగ్గకు చెందిన ప్రభాకర్.. పాములు పట్టడంలో దిట్ట. ఆయన్ని చుస్తేనే సర్పాలు సాగిలపడతాయంటారు చూసిన వాళ్లు. ఇప్పటి వరకు సుమారు వందుకుపైగా సర్పాలను పట్టి.. అడవుల్లో విడిచి పెట్టాడు ప్రభాకర్. కానీ అలాంటి వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఇంటిపొరుగున ఉండే రాజు అనే వ్యక్తికి పొలంలో కింగ్ కోబ్రా కనిపించింది. దానిని పట్టేందుకు రావాలని ప్రభాకర్‌ను కోరాడు. దీంతో పొలానికి వెళ్లిన అతని పై కోబ్రా ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో నీటి గుంటలో పడిపోయాడు. అయినా ధైర్యం కోల్పోకుండా.. సమయస్ఫూర్తితో చివరకు పాము మెడలు వంచాడు. ఈ ఘటన సోమవారం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.