వైరల్: యూపీలో 'రౌడీ పోలీస్' దౌర్జన్యం..! - హెల్మెట్ లేదని కొట్టిన పోలీసులు
ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థనగర్ జిల్లాలో పోలీసులు ఓ వ్యక్తిపై నడిరోడ్డు మీద దౌర్జన్యం చేశారు. ఖేసరహా ఠాణా పరిధిలోని సకార్పార్లో యువకుడిని తీవ్రపదజాలంతో దూషిస్తూ ఎస్ఐ దేవేంద్ర మిశ్రా, హెడ్ కానిస్టేబుల్ మహేంద్రప్రసాద్ చితకబాదారు. వాళ్లు కొట్టడానికి కారణం.. ఆ యువకుడు హెల్మెట్ లేకుండా మోటార్‌సైకిల్ నడపటమే. ఘటన అనంతరం వీడియో ఆధారంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం వల్ల సదరు పోలీసులను సస్పెండ్ చేశారు ఎస్పీ ధరమ్వీర్ సింగ్.
Last Updated : Sep 30, 2019, 10:47 AM IST