వైరల్: పోలీసులపై నిరసనకారుల ప్రతాపం - police red ford
గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఎర్రకోట వద్ద పోలీసులపై నిరసనకారులు దాడి చేశారు. కర్రలు, రాడ్లతో కొట్టారు. పలువురు ట్రాక్టర్లను పోలీసులవైపు తోలారు. సిబ్బందిని పక్కనే ఉన్న గొయ్యివైపు నెట్టారు. దీంతో.. 20 అడుగుల లోతైన గొయ్యిలో దూకి ఆందోళనకారుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.