10 ఎకరాల పొలంలో గడ్డితో శరద్ పవార్ చిత్రం - శరద్‌పవార్
ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌పై ప్రేమను... తన పదిన్నర ఎకరాల పొలంలో పండించిన పంటతో చాటుకున్నాడో అభిమాని. వేర్వేరు జాతుల మొక్కలను క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా పవార్ చిత్రాన్ని సృష్టించాడు మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా నిపానిగావ్ వాసి మంగేశ్ నిపానికర్. ఇందుకోసం తొలుత పొలంలో పొలంలో 200 కిలోల అల్యూ, 300 కిలోల మెంతులు, 40 కిలోల జొన్నలు, 40 కిలోల గోధుమ విత్తనాలను చల్లాడు. మొలకలొచ్చాక ఇలా పవార్ బొమ్మను తలపించేలా తీర్చిదిద్దాడు. ఇందుకోసం 15 రోజులు శ్రమించాడు మంగేశ్.