భవిష్యత్ కోసం బిస్కెట్లు దాచుకుంటున్న శునకం! - ఒడిశా భువనేశ్వర్
లాక్డౌన్ కారణంగా చాలా మంది నిత్యావసర వస్తువులను ఎక్కువ మోతాదులో ముందుగానే తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. ఓ వీధి కుక్క కూడా భవిష్యత్ కోసం ఆలోచించి బిస్కెట్లను దాచుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒడిశా భువనేశ్వర్లో చోటు చేసుకున్న ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.