గర్భిణీని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం - గంగోత్రి జాతీయ రహదారి న్యూస్
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన కారణంగా సోమవారం గంగోత్రి జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముక్బా గ్రామానికి చెందిన ఓ గర్భిణిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో సాయం కోసం పోలీసులకు ఫోన్ చేశారు బాధితురాలి కుటుంబసభ్యులు. 20 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకుని గర్భిణిని రక్షించింది ఎస్డీఆర్ఎఫ్ బృందం.