దిల్లీ నుంచి గల్లీ వరకు.. అన్నీ బంద్ - కరోనా వైరస్ ఇండియా
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో దేశప్రజలు 'జనతా కర్ఫ్యూ' పాటిస్తున్నారు. ఉత్తర భారతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. దాదాపు అన్ని రోడ్లు ఖాళీగా కనపడుతున్నాయి. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. దిల్లీ వీధులన్నీ వెలవెలబోతున్నాయి. ఉత్తరాఖండ్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం ఆదేశాలను లెక్కచేయకుండా కొంతమంది యువత క్రికెట్ ఆడుతూ కనపడ్డారు.