కరోనాకు భయపడొద్దంటూ సైకత శిల్పంతో సందేశం - Sand artist Sudarshan Patnaik
దేశాన్ని కలవరపెడుతున్న కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం సైకత శిల్పాన్ని రూపొందించాడు ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరీ సముద్రతీరంలో.. కరోనాతో భయపడాల్సిన అవసరం లేదనే సందేశంతో సైకత శిల్పాన్ని చెక్కాడు పట్నాయక్. ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే సురక్షతంగా ఉండవచ్చని.. ఆ శిల్పం ద్వారా తెలియజేస్తున్నాడు. ఈ చిత్రం వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.