కెప్టెన్ వరుణ్ సింగ్ కోలుకోవాలంటూ.. సైకత శిల్పం - కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యం
captain varun singh health: కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఆకాంక్షించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని యావత్ దేశం కోరుకుంటోందనే సందేశాన్ని తన కళాఖండంలో పొందుపర్చారు. ఇదే ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది సైనికాధికారులు మృతి చెందారు. కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
Last Updated : Dec 11, 2021, 5:35 AM IST