తెలంగాణ

telangana

ETV Bharat / videos

తలోజా జైలు నుంచి అర్ణబ్​ విడుదల

By

Published : Nov 11, 2020, 9:48 PM IST

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు...రిపబ్లిక్​ టీవీ ఎడిటర్ అర్ణబ్ గోస్వామి తలోజా జైలు నుంచి విడుదలయ్యారు. అంతకుముందు అర్ణబ్​తో పాటు మరో ఇద్దరికి మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఈ మేరకు ముంబయి పోలీసు కమిషనర్​కు ఆదేశాలు జారీ చేసింది. రిపబ్లిక్​ టీవీ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామి.. తలోజా జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. ఆయన్ను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో తలోజా జైలుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను చేపట్టారు. విడుదలైన అనంతరం కారు మీద నిలబడి.. నినాదాలు చేశారు అర్ణబ్​. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లిని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో ఆరెస్ట్​ అయిన అర్ణబ్​కు సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్​ జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details