గాల్లోకి లేచిన మహిళా సర్పంచ్.. బెదిరిన జేసీబీ! - rajasthan sarpanch jcb news
రాజస్థాన్‌లోని జాలోర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ సిబ్బంది జేసీబీలతో అక్రమ కట్టడాల కూల్చివేతకు సిద్ధం అవుతుండగా స్థానిక మహిళా సర్పంచ్ అడ్డుకున్నారు. జేసీబీకి ఎదురుగా నిలబడి నిరసన తెలిపారు. అయినా జేసీబీ డ్రైవర్ ముందుకు వచ్చే ప్రయత్నం చేయగా సర్పంచ్ దాని ముందు భాగాన్ని చేతితో గట్టిగా పట్టుకున్నారు. అదే సమయంలో జేసీబీ డ్రైవర్ ముందు భాగాన్ని పైకి ఎత్తాడు. ప్రమాదకర స్థితిలో దానితో పాటే సర్పంచ్ గాల్లోకి లేచారు.