ఏనుగుల గుంపు బీభత్సం.. మహిళకు తీవ్రగాయాలు - ఏనుగులు బీభత్సం
లాక్డౌన్తో ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. ఛత్తీస్గఢ్ వాసుల్ని వేరే భయాలు వెంటాడుతున్నాయి. మహాసముంద్ ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవుల్లోనుంచి జనావాసాల్లోకి చేరి స్థానికుల్ని భయాందోళనలకు గురిచేశాయి 19 ఏనుగులు. ఈ క్రమంలోనే ఓ మహిళపై దాడిచేసి గాయపరిచాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బాధితురాలిని ఆసుపత్రికి చేర్చారు. అనంతరం.. ఏనుగులను పట్టుకొనే పనిలో పడ్డారు.