ఎండైనా వానైనా... విధులే ప్రథమం! - guwahati
కుండపోత వర్షం కురుస్తున్నా సరే విధులు నిర్వర్తించటమే కర్తవ్యంగా భావించాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. అసోంలోని గువహటిలో జోరు వానలోనూ విధులు నిర్వహించి అంకితభావం చాటాడు. గువహటి నగరంలోని బటిస్టా చార్లి కూడలిలో మిథున్ దాస్ అనే కానిస్టేబుల్ ఆదివారం విధులు నిర్వర్తిస్తున్నాడు. రాత్రి సమయంలో వర్షం ప్రారంభమైంది. వర్షాన్ని లెక్కచేయకుండా కూడలిలోనే నిలబడి తన బాధ్యతలు నిర్వర్తించాడు మిథున్. ఈ వీడియో వైరల్ అవుతోంది.