అమిత్ షా రాజీనామాకు కాంగ్రెస్ ఎంపీల డిమాండ్ - పార్లమెంట్ గాంధీ విగ్రహం
లోక్సభలో కాంగ్రెస్కు చెందిన ఏడుగురు ఎంపీలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్లోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ ప్రదర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వం వహించారు. అంతే కాకుండా ఈశాన్య దిల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.