రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు 323 కిమీ పరుగు! - Punjab farmer Jagdeep Singh'
దిల్లీలో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనకు మద్దతుగా.. పంజాబ్ రైతులు పెద్దఎత్తున హస్తినకు తరలివెళ్తున్నారు. సంగ్రూర్ ప్రాంతానికి చెందిన జగ్దీప్ సింగ్ అనే ఓ వ్యక్తి వినూత్నంగా పరిగెత్తి దిల్లీ చేరుకోవాలనుకున్నాడు. ఆదివారం ఉదయం బయల్దేరిన జగ్దీప్.. సుమారు 323 కిలోమీటర్లు పరుగెత్తి దిల్లీ నిరసనల్లో పాల్గొననున్నట్టు చెప్పాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతడు ఇప్పటికే సుమారు ముప్పావువంతు దూరం పరుగు పూర్తిచేశాడు.