కళ్లు చెదిరేలా బైక్‌పై రైతు విన్యాసాలు - farmer bullet bike stunt
టిక్రీ సరిహద్దు వద్ద రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఉద్ధృతంగా సాగుతోంది. ఇందులో పాల్గొనేందుకు పంజాబ్, హరియాణా సహా పలు రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. పంజాబ్‌కు చెందిన బల్వీందర్ సింగ్ అనే రైతు బైక్‌పై కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తూ టిక్రీ సరిహద్దు వైపు దూసుకెళ్తున్నారు. ఆయన చేసే స్టంట్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. బల్వీందర్ 15 ఏళ్లుగా ఈ విన్యాసాలు చేస్తున్నట్లు చెప్పారు. టిక్రీ సరిహద్దులో రైతుల ర్యాలీకి మద్దతుగా వెళ్తున్నట్లు చెప్పారు.