మహిళపై చేయి చేసుకున్న పోలీసు- వీడియో వైరల్ - Punjab police Vedio
పంజాబ్లోని బఠిండాలో ఓ మహిళపై పోలీసు అధికారి చేయి చేసుకున్న వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్గా మారింది. స్టేషన్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు తమ హక్కుల విషయంలో ఆందోళనకు దిగారు. దీంతో పోలీసు అధికారులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కార్మికురాలిపై పోలీసు అధికారి నరేంద్ర కుమార్ విరుచుకుపడ్డారు. ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ కాగా.. విషయం ఉన్నతాధికారుల వరకు చేరింది. దాంతో మహిళకు నరేంద్ర కమార్ క్షమాపణలు చెప్పారు. పోలీసు అధికారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.