ప్రియాంక 'గాంధీగిరి'.. హౌస్ అరెస్ట్ వేళ చీపురు పట్టి...
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. చీపురు పట్టి స్వయంగా తన గదిని ఊడ్చుతూ కనిపించారు. ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ హింసాత్మక ఘటన నేపథ్యంలో.. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆదివారం ఆమెను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. సీతాపుర్లోని ఓ అతిథి గృహంలో ఉన్న ప్రియాంక.. ఇలా చీపురుతో గదిని శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది.