డ్రమ్స్ వాయిస్తూ ఉల్లాసంగా గడిపిన మోదీ - modi tripura
Modi plays Drums: ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికివెళ్లినా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు తగిన వేషధారణలో కనిపిస్తుంటారు. తన చర్యలతో ఇట్టే ప్రజలతో మమేకమైపోతారు. మంగళవారం.. మణిపుర్లో పర్యటించిన సందర్భంగా అక్కడి కళాకారులతో కాసేపు ముచ్చటించారు. ఉత్సాహంగా డ్రమ్స్ వాయించారు. ఇతర సంగీత వాద్యాలనూ పరిశీలించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించిన మోదీ.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.