సలసల కాగే నూనెలో నుంచి చేతితో అరిసెలు తీసి...
priest dipping hand in boiling oil: కర్ణాటక చామరాజనగర్ జిల్లాలోని సిద్ధప్పాజీ ఆలయంలో.. వినూత్న సంప్రదాయం అమలులో ఉంది. లొక్కనళ్లీ గ్రామంలోని ఈ దేవాలయంలో ఏటా కార్తికమాసం చివరి సోమవారం ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా.. సలసల కాగుతున్న నూనెలో పూజారి చేతులు పెట్టి తీసి, అరిసెలను భక్తులకు పంపిణీ చేస్తారు. కాగుతున్న నూనెను భక్తులపై వెదజల్లుతారు. కానీ ఎవరికీ ఎలాంటి గాయాలు కావని భక్తులు చెబుతున్నారు.