PRATIDWANI: డ్రగ్స్ ముఠాల ఆటకట్టించేదెలా? - heroine
మనుషులను మత్తుకు బానిసలుగా మార్చే హెరాయిన్ దేశంలోకి భారీగా రవాణా అయింది. బియ్యం, పండ్లు ఎగుమతులు, దిగుమతుల పేరుతో ఏర్పాటైన సంస్థ... దొంగ చాటుగా టన్నుల కొద్ది డ్రగ్స్‌ను దేశంలో కుమ్మరించింది. వేల కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకునే వ్యూహం లక్ష్యంగా ఆఫ్గానిస్థాన్ నుంచి ఇరాన్ మీదుగా ఈ డ్రగ్స్ భారత్‌కు చేరాయి. దేశంలో యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్ మాఫియా నెట్‌వర్క్‌ను ఛేదించడం ఇప్పుడు దేశానికి తక్షణావసరం. దేశ భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన డ్రగ్స్ ముఠాల ఆటకట్టించేదెలా? తెలుగు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల కట్టడి తీరు ఎలా ఉంది? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ.