నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది - డైనేజీపై ఫుట్పాత్ నిర్మాణంతో ప్రమాదం
ఓ వ్యక్తి నడుస్తుంటే ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. అతడితో పాటు పక్కనే ఉన్న వస్తువులూ భూమిలో కూరుకుపోయాయి. ఈ ఘటన రాజస్థాన్లోని సిరోహీలో చోటుచేసుకుంది. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డైనేజీపై ఫుట్పాత్ నిర్మించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సీసీటీవీ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కాయి. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు గాయపడ్డారు.