రెండు జిల్లాల పోలీసుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే? - పోలీసుల ఘర్షణ మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లో రెండు జిల్లాల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చైన్ స్నాచింగ్ నిందితులను పట్టుకునేందుకు ఎగబడి, ప్రశంసల కోసం చివరికి ఘర్షణకు దిగారు(police clash in india). పన్నా, సత్నా జిల్లాలో ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్ నేరాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో బవారియా ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను చిత్రకూట్ ప్రాంతంలో పన్నా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారిని సత్నా జిల్లా పోలీసులు అడ్డగించి, నిందితులను అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన యంత్రాంగం.. నిందుతుల కోసం పోలీసులు గొడవ పడటం అన్నది అవాస్తమని పేర్కొన్నారు.