ఆవుతో ఎద్దు 'ప్రేమాయణం'.. కానీ... - ఆవు ఎద్దు ప్రేమ
కరోనా మహమ్మారి సెగ మూగజీవాలనూ వదలటం లేదు. తమిళనాడు మదురై జిల్లా పాలమేడుకు చెందిన ఓ రైతు లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. ఆదాయ మార్గం కరవై.. చేతిలో చిల్లిగవ్వ లేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాడు. దీంతో తన వద్ద ఉన్న పశువుల్లో.. ఒక ఆవును పక్క గ్రామానికి చెందిన మరో రైతుకు విక్రయించాడు. ఆవును తరలిస్తున్న క్రమంలో.. ఓ ఎద్దు ఆ వాహనాన్ని అడ్డుకుంది. ఇంతకాలం కలిసి మెలిసి ఉన్న తమను విడదీయొద్దన్నరీతిలో వాహనానికి పదే పదే అడ్డుపడింది. దాదాపు గంటసేపు వాహనాన్ని అక్కడి నుంచి కదలనీయకుండా.. వాహనం చుట్టూ తిరిగింది. చివరకు వాహనం ఆవును తీసుకుని కదలటం వల్ల దాని వెంటే పరుగులు తీసింది.