జనాలపైకి దూసుకెళ్లిన ఎడ్ల బండి - ఎడ్ల బండి పోటీల్లో తృటిలో తప్పిన ప్రమాదం
🎬 Watch Now: Feature Video
కర్ణాటకలో నిర్వహించిన ఎడ్ల బండి పోటీలో పెద్ద ప్రమాదం తప్పింది. ఐదుగురు చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డారు. హసన్ జిల్లా దొడ్డబెమ్మత్తి గ్రామంలో నిర్వహించిన పోటీలో.. రేస్ ట్రాక్‌పై నిలుచున్న వారిపైకి ఓ ఎండ్ల బండి దూసుకెళ్లింది. అందరూ బండి కింద పడినప్పటికీ.. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రేక్షకులంతా రేస్‌ట్రాక్‌కు దూరంగా ఉండాలని ముందే హెచ్చరించినా చాలా మంది పట్టించుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైందని నిర్వహకులు చెప్పారు.