ఇష్టారాజ్యంగా సంచారం- కరోనా నిబంధనలు బేఖాతర్ - కరోనా నిబంధనల ఉల్లంఘన
ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా.. మహారాష్ట్రలోని కొన్నిచోట్ల కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలులో ఉన్నా.. నాసిక్ జిల్లా మాలేగావ్‌లో ప్రజలు ఇష్టారాజ్యంగా సంచారం చేస్తున్నారు. కనీసం మాస్క్ పెట్టుకోకుండా బజార్లలో గుమిగూడుతున్నారు. అయితే ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పరిపాలన యంత్రాంగం భావిస్తోంది.