కరోనా భయాలు బేఖాతరు- ఉత్సవాల్లో పాల్గొన్న వేలాది భక్తులు
కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా భౌతిక దూరం నిబంధన తప్పనిసరైంది. అయితే ఈ నియమానికి తూట్లు పొడుస్తూ.. పెద్దఎత్తున గుమిగూడారు కర్ణాటక వాసులు. హవేరీ జిల్లా ఖర్జాగీలో మూడేళ్లకోసారి జరిగే బ్రహ్మలింగేశ్వర వేడుకలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కరోనా మహమ్మారి తమను ఏమీ చేయదన్నట్లుగా.. కనీసం మాస్కు ధరించడం కూడా మర్చిపోయారా భక్తులు.