వర్షంలో తడుస్తూ.. టీకా కోసం ఎదురుచూస్తూ.. - టీకా కోసం క్యూలు
మహారాష్ట్ర ముంబయిలో కొవిడ్ టీకా తీసుకునేందుకు అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ధారావిలోని ఓ టీకా పంపిణీ కేంద్రం వద్ద.. ఆదివారం భారీ రద్దీ నెలకొంది. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా, రోడ్ల పొడవునా భారీ క్యూలో నిల్చుని, టీకా కోసం ప్రజలు ఎదురు చూశారు.