హోలీపై కరోనా ఎఫెక్ట్.. అక్కడ పుష్పాలతో వేడుకలు - రంగులతో కాదు... పువ్వులతో హోలీ పండగ
దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. ఉత్తర్ప్రదేశ్ మథురాలోని బాంకే బిహారి ఆలయం వద్ద వందలాది యువతీయువకులు ఉత్సాహంగా ఒకరిపై ఒకరు రంగులను జల్లుకున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పంజాబ్ అమృత్సర్లోని శివాలాబాగ్లో వినూత్నంగా హోలీని జరుపుకున్నారు. పువ్వులను చల్లుకుంటూ ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు అక్కడి ప్రజలు.