కరోనా ఆందోళనతో మాస్కులతో 'బురద హోలీ' - కరోనా ఆందోళనతో మాస్కులతో 'బురద హోలీ'
దేశవ్యాప్తంగా కరోనా రాకుండా ప్రజలు నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ఆందోళనలతో గుజరాత్ సూరత్‌కు చెందిన యువత మంగళవారం మాస్కులు ధరించి వినూత్నంగా హోలీ వేడుకలను నిర్వహించారు. నగరంలోని వెసు ప్రాంతంలో మడ్ ఫెస్టివల్ పేరుతో ఈ కార్యక్రమాన్ని జరిపారు. బురదను పూసుకుంటూ హోలీ జరుపుకున్నారు. అయితే బురదలోనూ మాస్కులు తియ్యలేదు ఈ యువత. మట్టిపూత సహజసిద్ధమైన సౌందర్యలేపనంగా పనిచేస్తుందని నమ్ముతారు ఇక్కడి ప్రజలు.
TAGGED:
corona effect